శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి బోణీ

19 నవంబర్, 2026

palakollu.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 03:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మున్సిపల్ ఎన్నికల్లో పాలకొల్లులో వైసీపీకి భారీ షాక్.

ప్రజాశక్తి - పాలకొల్లు : మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు నియోజకవర్గంలో టిడిపి బోణీ కొట్టింది.

టిడిపి 38వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా బుద్ధరాజు విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల చివరి రోజు వైసీపీ అభ్యర్థి కావలి చంద్రావతి నామినేషన్ ఉప సంహరించుకోవడంతో వార్డు ఏకగ్రీవం అయింది. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చంద్రావతి తో పాటు ఆమె భర్త కనకదుర్గ ఆలయ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన చంద్రావతి, శ్రీనివాస రావులకు మంత్రి నిమ్మల రామానాయుడు టిడిపి కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతో పాటు మంత్రి నిమ్మల పనితీరుకు మెచ్చి టిడిపిలో చేరినట్లు వారు వెల్లడించారు. పాలకొల్లు మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు మిగిలిన 43 వార్డులను కూటమి కైవసం చేసుకోబోతుందని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్