పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : ఒక వైపు పాల ప్యాకెట్లు, పంచదార ధరలకు రెక్కలు రావడంతో టీ, కాఫీ ధరలు కూడా పెరిగాయి. పాలకొల్లులో టీ ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్య ప్రజలు కడుపునిండా తినకపోయినా కనీసం పెదవులు తడుపుకునేందుకు టీ ఎక్కువసార్లు తాగుతారు. అయితే ప్రస్తుతం పట్టణంలో రూ.10 ఉన్న టీ రూ.12 కు పెరిగింది. రూ.15 రూపాయలు ఉన్న కాపీ కూడా రూ.20 కు పెరిగింది. బెల్లం కాఫీ రేట్లు కూడా పెరిగాయి. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వచ్చినట్లు ఎక్కడికక్కడ బోర్డులు వెలిశాయి. ఇది కేవలం ఒక్క పాలకొల్లులోనే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా టీ, కాఫీల ధరలు పెరిగాయి.. సామాన్యుడికి ఇప్పుడు కప్పు టీ లేదా కాఫీ తాగడం కూడా భారమయ్యింది.
పాల ప్యాకెట్లతో పాటు పెరిగిన టీ, కాఫీ ధరలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 09:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)