హైదరాబాద్ : సీనియర్ న్యాయవాది నక్కా రమేష్ బాబు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. నక్కా రమేష్ బాబు మృతిపై చిలకలూరిపేట బార్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు చిలకలూరిపేటకు రమేష్ బాబు పార్థివదేహం రానుంది. ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకురానున్నట్లు బార్ కమిటీ వెల్లడించింది. సహచర న్యాయవాదులు, బార్ సభ్యులు, మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. సీనియర్ న్యాయవాదిగా రమేష్ బాబు అందించిన సేవలను సహచరులు గుర్తు చేసుకున్నారు. రమేష్ బాబు కుటుంబ సభ్యులకు బార్ అసోసియేషన్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
సీనియర్ న్యాయవాది నక్కా రమేష్ బాబు కన్నుమూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)