ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పలలోను మండల పరిధిలోని పప్పూరు గ్రామంలో గురువారం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పర్యటించి ఇటీవల డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకున్న అభ్యర్థులను అవమానపరిచే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరించడం భావ్యం కాదని అన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్న ప్రభుత్వంపై బురద చల్లాలన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయని అన్నారు సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు వారి సమస్యపై ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో గ్రామ రైతులకు ఎల్ నినో ప్రభావం పై అవగాహన కల్పించారు మండల కేంద్రమైన నార్పల పాత పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించబోతున్న పురాతన వినాయక ఆలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ ప్లానింగ్ తదితర విషయాలను ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఆలయ నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నియోజకవర్గం లో ఎక్కడా లేనివిధంగా కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు అత్యధికంగా నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకట నరసా నాయుడు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ టిడిపి మండల కన్వీనర్ కుళ్లాయప్ప, మాజీ కన్వీనర్ పిట్టు రంగారెడ్డి, ఎర్ర నాగప్ప, మాజీ జెడ్పిటిసి జాఫర్ వలి ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసులు తాసిల్దార్ అరుణకుమారి ఎంపీడీవో మమతా దేవి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్, మండల విద్యాధికారులు కృష్ణయ్య, నారపరెడ్డి, మండల వ్యవసాయ అధికారి చెన్న వీరాస్వామి వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు టిడిపి నాయకులు, కార్యకర్తలు వినాయక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు...
నార్పలలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పర్యటన
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 09:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)