శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేపాల్ లో సోనూసూద్ సాయం - ‘సెల్ఫ్‌ మార్కెటింగ్‌’ అంటూ విమర్శలు

1 గంట క్రితం

Sonu Sood's aid in Nepal – Criticized as ‘self-marketing’
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 10:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : నేపాల్‌ లో వరద బాధితులను ఆదుకోవడానికి సినీనటుడు సోనూసూద్‌ తన బృందంతో అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. నేపాల్ లో ఆహారం, దుప్పట్లు, ఇతర నిత్యావసరాలను అందిస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అయితే ఆయన పర్యటనను ఓ జర్నలిస్ట్‌ ‘సెల్ఫ్‌ మార్కెటింగ్‌’గా విమర్శించారు.‘ ఇప్పటికిప్పుడు నేపాల్‌ వెళ్లి అక్కడి పిల్లలకు రక్షకుడిగా మారిపోయారా. ఇది పూర్తిగా ప్రచారం మాత్రమే. పనులు సరిగ్గా ప్రారంభించక ముందే ఆయనను దేవుడిగా చిత్రీకరించే మార్కెటింగ్ మొదలైంది ’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. తనపై వచ్చిన విమర్శలకు సోనూసూద్‌ హుందాగా సమాధానమిచ్చారు. ‘‘ సోదరా.. మీరు మంచి వారు. నేపాల్‌కు రండి. మనిద్దరం కలిసి ప్రజలకు సాయం చేద్దాం ’’ అని ఆహ్వానించారు. ఎలాంటి వివాదానికి తావివ్వకుండా, విమర్శించిన వారినే సహాయక చర్యల్లో భాగస్వామి కావాలని కోరడంతో సోనూసూద్‌కు నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. ఎన్నోసార్లు అవసరమైన వారిని ఆదుకొని చేసి ‘రియల్ హీరో’ అనిపించుకున్న సోనూసూద్‌ ఇప్పుడు నేపాల్‌కు కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నిత్యావసరాలు, సహాయక సామగ్రితో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ‘‘మనమంతా కలసి వారికి ఓ కొత్త జీవితాన్ని అందిద్దాం. నేపాల్.. నువ్వు ఒంటరివి కావు’’ అని సోనూ సూద్‌ ఆ ఫొటోలను పంచుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్