మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవెలిగొండ పనుల్లో అపశృతి

17 ఆగస్టు, 2026

montilal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రెండో సొరంగ మార్గంలో హైడ్రాలిక్‌ ‌వాహనం కింద పడి యువకుడు మృతి

ప్రజాశక్తి - పెద్దదోర్నాల (మార్కాపురం జిల్లా) : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగ మార్గంలో హైడ్రా మిషన్ (వాహనం) కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేరి జిల్లాకు చెందిన కార్మికుడు మొంటిలాల్ (19) రెండో సారంగ మార్గంలో పనిచేస్తున్నారు. రెండో టన్నెల్‌‌లో 12వ కిలోమీటర్ సమీపంలో బోరింగ్ మిషన్ వద్ద పనిచేస్తున్న మొటిలాల్‌ అర్ధరాత్రి డ్యూటీ దిగి బయటకి వెళ్లాల్సి ఉంది. సంబంధిత వాహనం ఆలస్యం కావడంతో నిద్ర వచ్చి... హైడ్రా‌లిక్‌ మిషన్ (‌వాహనం) వెనుక కూర్చొని నిద్రపోతున్నా‌రు. ఈ విషయం తెలియని డ్రైవర్ మిషన్‌‌ను వెనక్కి తీసుకెళ్లగా.. అతనిపై నుంచి వాహనం వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. దోర్నాల వైద్యశాలకు తరలించగా, పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.

యువకుని మృతి బాధాకరం : మంత్రి నిమ్మల రామానాయుడు

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2లో ఈ ప్రమాదం జరగడంతో మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అమరావతి నుంచి ఫోన్ ద్వారాప్రాజెక్టు సిఇ రమేష్‌తోనూ, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతోనూ మాట్లాడి వివరాలడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి అన్నిరకాలుగా సాయం అందించాలని అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్