సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘నో థ్యాంక్స్‌’.. : ట్రంప్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన దక్షిణ కొరియా

1 గంట క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 07:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌: ఇరాన్‌ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చే ప్రయత్నాల్లో అమెరికాతో కలిసి పనిచేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానాన్ని దక్షిణ కొరియా తిరస్కరించింది. ఈ విషయాన్ని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న చర్యలకు మద్దతుగా దక్షిణ కొరియా భాగస్వామ్యం అవుతుందా అని అడగ్గా.. ‘‘నో థ్యాంక్స్‌’’ అని సమాధానం ఇచ్చినట్లు ట్రంప్‌ తెలిపారు. ఇదే సమయంలో దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 17 నుంచి 27 వరకు అమెరికా-దక్షిణ కొరియా మధ్య ‘ఉల్చి ఫ్రీడం షీల్డ్‌’ సైనిక విన్యాసాలు జరగాల్సి ఉంది. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో తనకు ఉన్న సత్సంబంధాలు కూడా సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలన్న నిర్ణయానికి కారణమని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ విన్యాసాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, వాటిపై ఉత్తర కొరియాకు ఆసక్తి లేదని కిమ్‌ సంకేతాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని హరించాలన్న ట్రంప్ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఇతర దేశాల మద్దతు కూడగట్టేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్న సమయంలో దక్షిణ కొరియా తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్