ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోరుమామిళ్లలో త్రిముఖ పోరు..!

5 రోజుల క్రితం

A three way contest in Porumamilla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 03:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 13,507 ఓట్లలో 4 వేలు ముస్లిం ఓట్లే కీలకం..!

  • ముస్లిం ఓటు చీలితే రంగమ్మకే పట్టం..?


ప్రజాశక్తి-పోరుమామిళ్ల రూరల్ (కడప) : కడప జిల్లా పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నిక ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం ఓటర్లు 13,507. అందులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే దాదాపు 4 వేలకు పైగా ఉన్నారు. అంటే గెలుపోటములను తేల్చేది ముస్లిం ఓటర్లే.


వైసీపీలో రెండు వర్గాలు - ఇద్దరు ముస్లిం అభ్యర్థులు..!

వైయస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఒకే పార్టీలో రెండు వర్గాలు తలపడుతున్నాయి. ఒకవైపు నల్లేరు విశ్వనాథరెడ్డి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షేక్ సునిహ ను బలపరుస్తున్నారు. మరోవైపు అదే పార్టీలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షేక్ అర్షయా ను పోటీకి నిలబెట్టారు. ఒకే పార్టీ.. ఒకే సామాజిక వర్గం.. కానీ ఇద్దరు అభ్యర్థులు. దీంతో ముస్లిం ఓటర్లు రెండుగా చీలిపోతారా ? లేక ఒక్క అభ్యర్థికే ఏకమై గెలిపిస్తారా ? అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.


టీడీపీ ఎత్తుగడ - రంగమ్మ బరిలో..!

ఈ చీలికనే అవకాశంగా మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి సూర్యనారాయణ రెడ్డి గౌడ సామాజిక వర్గానికి చెందిన జడపోలు రంగమ్మ ను బరిలోకి దింపారు. ఆమె జడపోలు పిచ్చయ్య భార్య. గ్రామంలో జరుగుతున్న చర్చ ప్రకారం జడపోలు రంగమ్మ దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి అని, ఖర్చుకు వెనకాడరని టాక్ నడుస్తోంది. డబ్బు + ముస్లిం ఓట్ల చీలిక.. ఈ రెండూ కలిస్తే రంగమ్మకు కలిసి వస్తుందా ? అని ప్రత్యర్థులు లెక్కలు వేస్తున్నారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుతుందా ? లేక ముస్లిం ఓటర్లు ఒక్కటై వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తారా ? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ముస్లిం ఓటు చీలితే లాభం రంగమ్మకే. ఒక్కటైతే సునిహకో.. అర్షయాకో గెలుపు. చివరకు పోరుమామిళ్ల పీఠం ఎవరిదో తేలాలంటే 26వ తేదీ వరకు ఆగాల్సిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్