ప్రజాశక్తి - నందలూరు : వినాయక చవితి వేడుకల్లో భక్తితో పాటు వినూత్నతను జోడిస్తూ నాగిరెడ్డిపల్లి మదర్ తెరిసా వీధి యువత ఏర్పాటు చేసిన గణపయ్య మండపం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గణపయ్యకు ఆధార్, పాన్ కార్డు థీమ్‌తో ఏర్పాటు చేసిన అలంకరణపై కొందరు యువతను అభినందిస్తుండగా.. మరికొందరు మాత్రం దేవుడి రూపాలకు ప్రభుత్వ గుర్తింపు కార్డుల రూపకల్పనను జోడించడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నిస్తున్నారు. గణపయ్య ముందు సెల్ఫీలు దిగుతూ యువత సందడి చేయడం, ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ‘భక్తికి కొత్త రూపమా.. లేక వైరల్ కావాలనే ప్రయత్నమా?’ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు వినాయక వేడుకలను ప్రత్యేకంగా నిలిపేందుకు ఈ థీమ్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. మొత్తానికి నాగిరెడ్డిపల్లి గణపయ్యకు వచ్చిన ‘ఆధార్–పాన్’ సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.
గణపయ్యకు ఆధార్...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 04:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)