ప్రజాశక్తి- కోటనందూరు : ఆరుతడి పంటలపై రైతులు ఆసక్తి చూపాలని వ్యవసాయవ శాఖ తుని డివిజన్ వ్యవసాయ సహాయక సహాయకులు జెకె.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం సురపురాజుపేట, భీమవరపు కోట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించే ఆయన మాట్లాడుతూ .. వాతావరణంలో పెను మార్పులు రావడం వల్ల, ఎలి నీనో సమస్య వలన నీటి ఎద్దడి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటలుగా అపరాలు, పచ్చి రొట్ట గడ్డి విత్తనాలు రైతు సేవ కేంద్రం అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. అనంతరం పరిసర గ్రామాలను పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ జగ్గ అప్పారావు , విఏఏ సాయి , శివాజీ గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలపై రైతులు ఆసక్తి చూపండి : ఏడి చంద్రశేఖర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)