ప్రజాశక్తి-కొండాపురం(కడప) : జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం కొండాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు, బ్యాంకు స్టాంపింగ్, ఓబన్నపేట బస్టాప్ వద్ద బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతో ఇప్పటివరకు వాటిని ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్ షెల్టర్లు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై బస్సుల కోసం వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వేగంగా దూసుకెళ్లే వాహనాల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై నిలబడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. వర్షం, ఎండ వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణికులకు రక్షణ లేకుండా పోతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారి నిర్మాణ సంస్థ స్పందించి రైల్వే స్టేషన్ రోడ్డు, బ్యాంకు స్టాంపింగ్, ఓబన్నపేట బస్టాప్ వద్ద వెంటనే బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)