గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమస్యల పరిష్కారం కోసం ఎస్ డబ్ల్యూ ఎఫ్ రిలే నిరాహార దీక్ష

1 గంట క్రితం

swf.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 12:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం : మూసివేసిన నాలుగు ఆర్టీసీ డిపోలను వెంటనే తెరిపించాలని, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీకే అప్పగించాలని కోరుతూ.. ఎస్ డబ్ల్యూ ఎఫ్ విజయనగరం జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు–2 డిపో పోరాట కమిటీ ఆధ్వర్యంలో 214 రోజులుగా రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా గురువారం విజయనగరం డిపో గేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... పినాకిల్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరారు. స్త్రీ శక్తి పథకంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు–2 డిపో పోరాట కమిటీ చేపడుతున్న దీక్షలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఎస్ డబ్ల్యూ ఎఫ్ విజయనగరం జిల్లా కమిటీ నాయకులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్