న్యూఢిల్లీ : తనకు విధించిన 25 ఏళ్ల జైలు శిక్ష పూర్తయినందున విడుదల చేయాలని కోరుతూ గ్యాంగ్‌స్టర్ అబూ సలెం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మా సనం బహిరంగ న్యాయస్థానంలో తీర్పులోని కీలక భాగాన్ని వెలువరిస్తూ, "ప్రస్తుత అప్పీల్ ప్రారంభ దశలోనే కొట్టివేయబడింది" అని పేర్కొంది. జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో బాంబే హైకోర్టు తిరస్కరించడంతో అబూ సలెం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1993నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో, పేలుళ్ల కోసం గుజరాత్ నుండి ముంబయికి ఆయుధాలను తరలించినట్లు తేలడంతో సలీమ్ దోషిగా నిర్థారిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ పేలుళ్లలో 257మంది మరణించగా, 700మందికి పైగా గాయపడ్డారు.
గ్యాంగస్టర్ అబూసలెం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 12:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)