గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంటి పన్ను అక్కర్లేదని చెప్పినా అదే తంతు

1 గంట క్రితం

house tax.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 12:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పెన్షన్ దరఖాస్తుకు తప్పని తిప్పలు

ప్రజాశక్తి-మంగళగిరి : ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళల సంక్షేమార్గం పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ, వెబ్సైట్ ఓపెన్ చేసింది. దీంతో అనేక మంది సచివాలయాలకు వెళ్లి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పెన్షన్ దరఖాస్తుకు ఇంటి పన్ను చెల్లింపు రసీదు జత చేయాలని కొన్నిచోట్ల సచివాలయ సిబ్బంది దరఖాస్తు దారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి ఇంటి పన్ను రసీదును జత చేయడం అనేది తప్పనిసరి కాదని పేర్కొంది. అయితే వెబ్సైట్లో మాత్రం తప్పనిసరిగా ఇంటి పన్ను రసీదును జత చేయాల్సిందే అంటూ ఆప్షన్ చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అద్దె ఇంట్లో ఉంటున్న వారు ఇంటి పన్ను రసీదు తెచ్చి పింఛన్ మంజూరుకు అర్హత పొందే విషయంలో లబ్ధి దారులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్