ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : డిసెంబర్ 2న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ రోజున స్వేచ్ఛగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చని సిఐ నగేష్ బాబు సూచించారు. చిన్నకత్తెరపల్లి,ఆకుతోటపల్లి,ఉప్పలూరు గ్రామాలను సోమవారం నగేష్ బాబు సందర్శించి ఎన్నికలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సిఐ గ్రామస్తులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవికి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసే అర్హులైన అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చన్నారు.అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.నామినేషన్, ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.ప్రజలు,మహిళా ఓటర్ల శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.
అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేయవచ్చు : సిఐ నగేష్ బాబు
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)