ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : కడప తాడిపత్రి ప్రధాన రహదారిలోని ఓబుళాపురం వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొని పల్టీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ... కారు ముద్దనూరు మీదుగా తాడిపత్రి వైపు వెళ్తుండగా ఓబుళాపురం గ్రామ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు అదుపు తప్పి డివైడర్ డీ కొట్టి పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు - ఐదుగురికి గాయాలు
28 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026, 12:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)