శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి పోలీస్ ఆంక్షలు

38 నిమిషాల క్రితం

Police restrictions on MP Y.S. Avinash Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 12:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎంపీ నివాసానికి నోటీసులు అంటించిన పోలీసులు


ప్రజాశక్తి-పులివెందుల టౌన్ (కడప) : స్థానిక జెడ్పిటిసి, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శుక్రవారం చివర రోజు కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడప పార్లమెంటు సభ్యుడు వైయస అవినాష్ రెడ్డి నివాసానికి పోలీసులు నోటీసులు అందించారు. పులివెందులలో బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 163 అమలులో ఉన్నందున పులివెందులలో ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే నలుగురు లేదా ఐదుగురు కన్నా ఎక్కువ వ్యక్తులు గుమికూడి ఉండకూడదని నోటీసులలో పేర్కొన్నారు. అక్టోబర్ 17 న కూడా ఆంక్షలు ఉల్లంఘించినట్లు నోటీసులో ప్రస్తావించారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంపీ పై చర్యలు తీసుకుంటామని పోలీసుల నోటీసులలో హెచ్చరించారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పేరిట నోటీసు జారీ కావడం జరిగింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్