కూటమిలో విద్వేషాలు,పలువురికి గాయాలు - ఘర్షణలో కారు దగ్దం
ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ముద్దనూరు మండలంలోని చిన్నదుద్యాల గ్రామంలో కూటమిలో విద్వేషాలు వెల్లువెత్తాయి. సోమవారం టిడిపి, బిజెపి నాయకులు,కార్యకర్తలు కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇండ్లపై, వాహనాలపై దాడులు చేసుకున్నారు. కారు తగలబెట్టారు. జమ్మలమడుగు డిఎస్పి వెంకటేశ్వరరావు, సిఐ నగేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్తులు, బాధితులతో మాట్లాడారు. క్షతగాత్రులను 108లో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.









కామెంట్‌లు (0)