సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు రహిత సమాజానికి కృషి చేయాలి : ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీత

1 గంట క్రితం

We must strive for a tobacco free society Deputy District Medical and Health Officer Dr Geetha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 01:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం - ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి..డాక్టర్ గీత


ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : పొగాకు ఉత్పత్తుల వాడకం ఆరోగ్యానికి హానికరమని పొగాకు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీత పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పొగాకు రహిత యువత ప్రచారంలో భాగంగా సోమవారం గీత జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ .. యువతలో పొగాకు వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పొగాకు రహిత యువత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు,బీడి,ఖైనీ,గుట్కా,జర్దా వంటి పదార్థాల వినియోగం వల్ల నోటి,ఊపిరితిత్తుల క్యాన్సర్,గుండె సంబంధిత,శ్వాసకోశ వ్యాధులు వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయన్నారు. సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం,విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం,18 ఏళ్ల లోపు వారికి పొగాకు ఉత్పత్తుల విక్రయం నిషేధం వంటి నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వాములై యువతను పొగాకు వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరిష్మా ,హెల్త్ ఆఫీసర్ వై.ప్రసాద్ యాదవ్, హెచ్ ఎమ్ ఓబులేసు, సూపర్ వైజర్ రామారావు, జైకుమార్, టొబాకొ కౌన్సిలర్, సుమలత,

వైద్య సిబ్బంది, ఉపాద్యాయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్