గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పేదలకు వరం సీఎం సహాయ నిధి : చమర్తి

2 రోజుల క్రితం

పేదలకు వరం సీఎం సహాయ నిధి : చమర్తి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజంపేట (కడప) : సీఎం సహాయనిది పేదలకు వరమని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో సీఎంఆర్ఎఫ్ కీలకమని, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. మంగళవారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు మంజూరైన రూ 21,40,211 లక్షలకు గాను దాదాపు 28మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను చమర్తి జగన్ మోహన్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదవారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో లబ్ధి చేకూరుస్తుందని, సహాయాన్ని అందిస్తుందని తెలియజేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పట్ల చంద్రబాబుకు, నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సుబ్బ నరసయ్య నాయుడు, వైస్ చైర్మన్ కర్ణాటకం చెంగల్ రాయుడు, పట్టణ అధ్యక్షులు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, సొసైటీ చైర్మన్ ముల్లగూరి సుబ్రహ్మణ్యం నాయుడు, మండల అధ్యక్షులు మేడికొండ రవికుమార్ నాయుడు, పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి ఎస్కె కర్రీమ్, మాజీ రాష్ట్ర కార్యదర్శి ఇడుమడుగుల కుమార్, ప్రముఖ దంత వైద్యులు నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్