శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒరిజినల్ సర్టిఫికెట్ చూపించినా కాదంటూ.. సిపిఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

46 నిమిషాల క్రితం

CPM candidate's nomination rejected, despite the presentation of the original certificate
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 03:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆర్వో ఉద్దేశపూర్వకంగానే క్యాస్ట్ సర్టిఫికెట్ లేదంటూ సిపిఎం అభ్యర్థి వేసిన నామినేషన్ తిరస్కరణ

  • ఒరిజినల్ చూపిస్తున్న కూడా పట్టించుకోని ఆర్ ఓ అన్న సిపిఎం పార్టీ అభ్యర్థి హరి


ప్రజాశక్తి - బ్రహ్మంగారిమఠం (కడప) : బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డి పల్లె పంచాయతీ 3 కి సిపిఎం అభ్యర్థి హరి నామినేషన్ వేయడం జరిగినది. శనివారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా నామినేషన్ల పరిశీలన ఆఫీస్ కి వెళ్ళిన సిపిఎం అభ్యర్థి ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించినప్పటికీ క్యాస్ట్ సర్టిఫికెట్ లేదంటూ ... ఆర్వో తిరస్కరించినట్లుగా సిపిఎం అభ్యర్థి వెల్లడించారు. అధికారులు మొత్తం కూడా అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ టిడిపి నాయకులను నామినేషన్ల ఆఫీసులో కూర్చోబెట్టుకొని ఇలా నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ స్పందించి తాను వేసిన నామినేషన్ ను పరిశీలించి తాను పోటీలో నిలబడే లాగా సహకరించాలని సిపిఎం అభ్యర్థి కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్