ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ శనివారం పరిశీలించారు. రామచంద్రపురం పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును, దీంతో పాటుగా కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అదేవిధంగా పోలింగ్ సామాగ్రిని భద్రపరిచే జూనియర్ కళాశాలను ఆయన పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన రూట్ మ్యాప్ ల వివరాలను ఆయన కమిషనర్ కె.వి.ఆర్ ఆర్ రాజును అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కమీషనర్ తో పాటు, తాసిల్దార్ మృత్యుంజయరావు, ఆర్ అండ్ బి డి ఈ టీవీఎస్ సూర్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్
44 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)