ప్రజాశక్తి - లింగసముద్ర (ప్రకాశం) : లింగసముద్రంలోని కమ్మిశెట్టి రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024-25, 2025-26 సంవత్సరాలలో ఎస్ఎస్సీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. శనివారం పాఠశాల పూర్వ విద్యార్థి, తిమ్మారెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యులు, మాజీ డీఆర్డీవో డైరెక్టర్ కీ.శే. జడ శ్రీనివాసులు జ్ఞాపకార్థం వారి సతీమణి జడ రజిని ఈ బహుమతులు అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.5,000, ఎస్సీ సామాజిక వర్గంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి రూ.5,000 చొప్పున రెండేళ్లకు కలిపి మొత్తం రూ.20 వేల నగదు బహుమతులను పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. నగదు బహుమతి అందుకున్న విద్యార్థులు కె. మహాలక్ష్మి,కె. పృథ్వీ బి.వి. హరిత ఆర్తి, కె.సరిత ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉమ్మడిశెట్టి మాధవరావు మాట్లాడుతూ ... జడ శ్రీనివాసులు ఈ పాఠశాలలో చదువుకొని దేశ అత్యున్నత స్థాయికి ఎదిగిన వారిలో ఒకరని పేర్కొన్నారు. జడ రజిని మాట్లాడుతూ ... విద్యార్థులు ఇప్పటి నుంచే కష్టపడి చదివి అత్యంత గౌరవప్రదమైన స్థాయికి ఎదగాలని సూచించారు. మెరిట్ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉంటే సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు పాఠశాల ఉపాధ్యాయులు ఎం. కొండయ్య,కే.ప్రభాకర్, కె.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 03:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)