ప్రజాశక్తి-సింహాద్రిపురం(కడప): మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీల డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేస్తున్న మేస సురేష్‌కుమార్ (55) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని రామాలయం వీధిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న ఆయన ఇటీవల పదోన్నతిపై డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నప్పుడే గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతునికి భార్య గీత, కుమారుడు మనోజ్‌కుమార్, కుమార్తె ఉషాదేవి ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆళ్లగడ్డలోని సురేష్‌కుమార్ స్వగృహానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని వారు విచారం వ్యక్తం చేశారు.







కామెంట్‌లు (0)