ప్రజాశక్తి-కడప అర్బన్ : కడప నగరం, రూరల్ ప్రాంతాలలో రేషన్ షాపుల ద్వారా చక్కెర, గోధుమపిండి అక్టోబర్ కు నిలిపివేయడం అన్యాయమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.దస్తగిరి రెడ్డి అన్నారు. శనివారం పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి కి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయని, నిత్యవసర వస్తువుల ధరలు బహిరంగ మార్కెట్లో ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా చక్కెర, గోధుమపిండి, కంది బేడలు, పామాయిల్ నూనె ఇచ్చి సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజానీకానికి వెసులుబాటు కల్పించాలని కోరారు. ఎన్నికల ముందు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన సరుకులు అందిస్తామని మాట ఇచ్చి నేడు తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని దసరా, దీపావళి సందర్భంగా రేషన్ షాపుల ద్వారా చక్కెర, గోధుమపిండి, పామాయిల్ నూనె, కంది బేడలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన, పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) కడప నగర కార్యదర్శి డి.నరసింహ, నాయకులు శ్రీరాములు, మురళి పాల్గొన్నారు.
చక్కెర, గోధుమపిండి రేషన్ షాపుల ద్వారా ఇవ్వండి : సిపిఎం
03 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026, 04:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)