శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అటవీ సంపద పరిరక్షణకు కృషి

59 నిమిషాల క్రితం

kadapa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 05:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు ; అటవీ సంపద,వన్య ప్రాణుల పరిరక్షణకు కృషి చేయాలని ముద్దనూరు డివిజన్ అటవీశాఖ అధికారి శ్రీనివాసులు సూచించారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం ఎఫ్ఆర్ఒ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. చెట్లు నరకడం, వన్య ప్రాణులను వేటాడం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. తమకు కేటాయించిన పరిధిలో సక్రమంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఒ శ్రీనివాసులు,సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్