శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘భోగి’ నుంచి పల్లె అందాలను ఆవిష్కరించే పాట విడుదల

1 గంట క్రితం

song.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 06:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ పల్లెటూరి అందాలు, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబిస్తూ శర్వానంద్‌ నటిస్తున్న ‘భోగి’ చిత్రంలోని కొత్త పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 12న విడుదల కానుంది.

‘ఎగిలి వారంగాలేసి..’ అంటూ సాగే ఈ పాటలో ప్రకృతి రమణీయతతో పాటు తెలంగాణ పల్లెల్లోని జీవన విధానాన్ని అందంగా ఆవిష్కరించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం సమకూర్చారు. నల్గొండ గద్దర్‌ నరసన్న, కందుకూరి శంకర్‌బాబు, రేలారే గోపాల్‌ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఈ లిరికల్‌ వీడియోలో కనిపించే పల్లె వాతావరణం, గ్రామీణ దృశ్యాలు ప్రేక్షకులకు తమ సొంత ఊరి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉన్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్