శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్కిటిక్‌ సూపర్‌ 500: క్వార్టర్స్‌లో సింధు

1 గంట క్రితం

sindu.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 05:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అర్కిటిక్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి. సింధు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో జపాన్‌ క్రీడాకారిణి రికో గుంజిపై 21-15, 21-15తో వరుస గేముల్లో విజయం సాధించింది.

జులైలో జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టైటిల్‌ను గెలుచుకున్న సింధుకు తదుపరి రౌండ్‌లో గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రపంచ మాజీ ఛాంపియన్‌, టాప్‌ సీడ్‌ రచనోక్‌ ఇంతానన్‌ (థాయ్‌లాండ్‌)తో ఆమె తలపడనుంది. మరో మ్యాచ్‌లో రచనోక్‌ 21-18, 21-7తో భారత క్రీడాకారిణి తన్వి శర్మపై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది.

పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ నిరాశపరిచాడు. తొలి రౌండ్‌లో కెనడాకు చెందిన బ్రియాన్‌ యాంగ్‌తో జరిగిన పోరులో 21-15, 15-21, 13-21తో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్