శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జీవశాస్త్ర రంగాల్లో విస్తృతమైన కెరీర్ అవకాశాలు : ప్రొఫెసర్ ఎం. సుభాష్ చంద్ర

9 నిమిషాల క్రితం

Extensive Career Opportunities in the Fields of Biological Sciences Professor M Subhash Chandra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 05:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కడప : జీవశాస్త్ర రంగంలో విస్తృతమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయని యోగివేమన విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎం. సుభాష్ చంద్ర అన్నారు. ప్రభుత్వ పురుషుల కళాశాల (ఏ), కడపలోని జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డి బి టి స్టార్ కాలేజ్ పథకం కింద స్టార్ టాక్ –2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా “తరగతి గది నుండి కెరీర్ వరకు... లైఫ్ సైన్స్ రంగంలో ఉద్భవిస్తున్న అవకాశాల అన్వేషణ” అనే అంశంపై శుక్రవారం ప్రత్యేక ఉపన్యాసకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగి వేమన విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి ప్రొఫెసర్ డా. ఎం. సుభాష్ చంద్ర స్టార్ ఎక్స్‌పర్ట్‌గా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తరగతి గది విద్యను ఆధునిక జీవశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసుకుంటూ ఉన్నత విద్య, పరిశోధన, ఉపాధి మరియు ఇతర కెరీర్ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జీవశాస్త్ర రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంపొందించుకోవాలని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇస్తూ వారితో ముఖాముఖి చర్చించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. జె. వెంకట లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని ఆధునిక విద్యా, పరిశోధనా అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. డా. జి. వెంకట సుబ్బయ్య మంచి విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన విద్య మరియు భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన అవసరమని తెలిపారు. డి బి టి స్టార్ కాలేజ్ పథకం సమన్వయకర్త డా. వై. సావిత్రి మాట్లాడుతూ కళాశాలలో డి బి టి స్టార్ కాలేజ్ పథకం ద్వారా నిర్వహిస్తున్న వివిధ విద్యార్థి-కేంద్రీకృత కార్యక్రమాలు, ప్రాక్టికల్ శిక్షణలు, నిపుణుల ఉపన్యాసాలు, పరిశోధనా కార్యకలాపాలు మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు తరగతి గది విద్యతో పాటు ప్రస్తుత శాస్త్రీయ రంగాల్లో అవసరమైన నైపుణ్యాలను అందించడమే స్టార్ కాలేజ్ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో డా. సి. నరసింహరావు, డా. హరి ప్రసాద్, నవనీశ్వర్ రెడ్డి, కల్పన, డా. పి. కృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. కళాశాలలోని లైఫ్ సైన్సెస్ విభాగాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రొఫెసర్ సుభాష్ చంద్రతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.కార్యక్రమం విద్యార్థులకు జీవశాస్త్ర రంగంలో ఉన్నత విద్య, పరిశోధన మరియు కెరీర్ అవకాశాలపై స్పష్టమైన అవగాహన కల్పించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్