ప్రజాశక్తి కడప అర్బన్ : రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ చింతా మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... చంద్రబాబును ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. కాంగ్రెస్‌లో ఎదిగిన చంద్రబాబు ప్రస్తుతం బీజేపీకి తొత్తుగా మారారని విమర్శించారు. మోడీ, అమిత్ షా రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని చెప్పారు. బియ్యం, పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కోటీశ్వరులకు కట్టబెట్టడం దారుణమని పేర్కొన్నారు. రైతులు, పేదలకు బ్యాంకు రుణాలు అందని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు రూ.16.5 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఆరోపించారు. మోడీ 12 ఏళ్ల పాలనలో రూ.150 లక్షల కోట్ల విదేశీ అప్పులు చేశారని చెప్పారు. ఇంత భారీగా అప్పులు తీసుకుచ్చి ఏం చేశారో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ అప్పులు, నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం : మాజీ ఎంపి చింతామోహన్
21 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 04:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)