శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేరాల ఆంజనేయ విగ్రహానికి నిప్పు

12 నిమిషాల క్రితం

Fire set to the Anjaneya idol at Peralaa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 05:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సీసీ కెమెరాలు ధ్వంసం..

- అనుమానిత పూజారి బాలాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు


ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : పేరాల చినరథం సెంటర్‌లోని ఆంజనేయ స్వామి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టిన ఘటన పట్టణంలో కలకలం రేపింది. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ ఆలయంలో పూజారిగా పనిచేసిన బాలాజీపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండో పట్టణ సీఐ శశికుమార్ విచారణ చేపట్టారు. పేరాల సెంటర్‌లోని ఓ టిఫిన్‌ హోటల్‌ వద్ద ఉన్న బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.గతంలో ఆలయ నిర్వాహకులు బాలాజీని పూజారి విధుల నుంచి తొలగించి మరో వ్యక్తిని నియమించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకుని ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే విగ్రహానికి నిప్పు పెట్టింది ఎవరు ? సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి ? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.విచారణలో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్