శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహారాజ్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

1 గంట క్రితం

kadapa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 04:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చికెన్ లాలిపాప్ శాంపిల్స్ ల్యాబ్‌కు తరలింపు

ప్రజాశక్తి - పోరుమామిళ్ల రూరల్ : మండల కేంద్రంలోని ప్రముఖ మహారాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిత ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో కిచెన్, స్టోర్ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆహార నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రెస్టారెంట్‌లో వాడుతున్న నూనెలు, మసాలాలు, చికెన్ నిల్వలను తనిఖీ చేశారు. చికెన్ లాలిపాప్ తయారీలో వాడుతున్న రంగులు, పదార్థాలపై అనుమానం రావడంతో శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ రిపోర్టులో కల్తీ తేలితే FSSAI చట్టం ప్రకారం కఠిన చర్యలు, లైసెన్స్ రద్దు తప్పదని FSO హరిత హెచ్చరించారు. కిచెన్ పరిశుభ్రత పాటించాలని, సిబ్బంది గ్లౌజులు, క్యాప్స్ ధరించాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్