-తిరగబడండి తోడుగా ఉంటా
-రక్షకుడే దౌర్జన్యం చేస్తే రక్షించేది ఎవరు
-అన్యాయం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టను
-నా కార్యకర్తపై వేటు వేస్తే నాపై వేసినట్టే
- నామినేషన్ పత్రాలు లాక్కున్నట్టే ఆస్తి పత్రాలు లాక్కుంటారు
ప్రజాశక్తి-పులివెందుల టౌన్ (కడప) : తిరగబడండి తోడుగా ఉంటానని, రక్షకుడే దౌర్జన్యం చేస్తే రక్షించేది ఎవరని, అన్యాయం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టనని, కార్యకర్తలపై వేటు వేస్తే తనపై వేసినట్టేనని, నామినేషన్ల పత్రాలు లాక్కున్నట్లే ఆస్తి పత్రాలు లాక్కుంటారని, సెప్టెంబర్ లో పాదయాత్ర చేస్తానని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి శ్రేణులతో అన్నారు. మంగళవారం పులివెందులలోని స్థానిక వైసిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైసిపి నాయకుల, కార్యకర్తల సమావేశంలో వైఎస్.జగన్ మాట్లాడుతూ .... మహా భారతంలోని శకుని లా రాష్ట్రంలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, సుప్రీం కోర్టు చెప్పినా కూడా అధికార పార్టీ నాయకులు, అధికారుల తీరు మారలేదన్నారు. నామినేషన్లు వేయించకుండా గెలిచినామని చెప్పుకోవడం ఏంటి అని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసులు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. గతంలో బూతుల వద్ద రిగ్గింగ్ చేసుకోవడం చూశామన్నారు. నామినేషన్ కేంద్రాలను హైజాక్ చేయడం ప్రస్తుతం చూస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించి గెలిచి చంకలు గుద్దుకుంటే అర్థం ఉంటుంది ఎవరిని నామినేషన్ లు వేయించకుండా గెలిచాం అని చంకలు గుద్దుకోవడం చూస్తే బుద్ధి లేని వాళ్లని తెలుస్తుంది అని విమర్శించారు. సూపర్ 6 లేదు సూపర్ 7 లేదు ఇచ్చిన హామీలు అన్ని జీరో చేసి ప్రజల్లోకి వెళ్లలేక చంద్రబాబు శకుని పాచికలు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద తన అక్క చెల్లెమ్మల ను ఒక కిలోమీటర్ దూరంలో పెట్టీ టిడిపి గూండాలను మాత్రం నామినేషన్ కేంద్రంలోని తీసుకెళ్లడం, తమ అక్క చెల్లెమ్మ ల చీరెలు లాగి నామినేషన్ పత్రాలను చించి వేశారని తెలిపారు. మహిళల కు వైసిపి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘటన చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ వేయడానికి పోయిన అభ్యర్థులపై లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిగిన ఘటన ఇక్కడ తప్ప ఎక్కడ జరిగి ఉండదని అన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో కొన్ని నామినేషన్లను వేయనీయకుండా మరి కొన్ని స్ర్కూటినీ పేరుతో అర్ధరాత్రి నామినేషన్ రద్దు చేసి ఏకగ్రీవం చేసుకున్న ఘనత చంద్రబాబుది అని మండిపడ్డారు. పులివెందులలో గెలుపు కోసం కార్యకర్తలు అందరూ సమష్టిగా ఉండి పోరాడాలన్నారు. పులివెందులలో కొడితే రాష్ట్ర వ్యాప్తంగా వినపడాలన్నారు. తమ టైమ్ వస్తే వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. ఇప్పటికైన వారు మార్పు తెచ్చుకోవాలని పోలీసులను హెచ్చరించారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కేసులు పెడతారనీ, లాఠీలతో కొడతారనీ ఇది మామూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, దుశాంత్ రెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.







కామెంట్లు (0)