మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుఫాను వేళ పడవలు నడపవద్దని హెచ్చరిక

1 గంట క్రితం

Warning issued against operating boats during a storm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 01:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వీరఘట్టం (మన్యం) : తుఫాను ప్రభావం దృష్ట్యా వీరఘట్టం మండల తహసీల్దార్ (MRO), వీరఘట్టం ఎస్‌ఐ కలిసి పనసనందివాడ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి, తుఫాను సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పాటించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అలాగే, తుఫాను పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పడవలను నడపకూడదని పడవల నిర్వాహకులను హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్