ప్రజాశక్తి-గోపాలపురం (తూర్పు గోదావరి) : రాంపాలెం నుండి గంగోలు కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న రోడ్డు కల్వర్టు కుంగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాంపాలెం గ్రామస్తులు తెలుపని వివరాల ప్రకారం ... మండలంలోని రాంపాలెం పరిధిలో ఉన్న బాలంకి చెరువు నుండి వచ్చే కొమ్ము నీరు పంట పొలాలకు నీరు వెళ్లేందుకు ఉన్న పంట బోదు రాంపాలెం నుండి గంగోలు కు వెళ్లే (పిఆర్ రోడ్డు) ప్రధాన రహదారిలో పంటబోదుకు కల్వర్టు ఏర్పాటు చేశారు. ఈ కల్వర్టు సోమవారం ఉదయం ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ రహదారిలో అనేక స్కూలు బస్సులు, ద్విచక్ర వాహనాలు, అనేక వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు కలవర్టు కుంగిపోయే సమయంలో ప్రయాణికులు, వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ రోడ్డు కలవర్టు నిర్మించి సుమారు 30 సంవత్సరాల పైగా కావస్తుందని తెలిపారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లిందని , అనేక మంది రైతులు, వాహనాలు, ఈ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు అని తెలిపారు. వెంటనే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా రోడ్ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని. రోడ్డు కల్వర్టు వెంటనే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.
కుంగిన రోడ్డు కల్వర్టు - నిలిచిపోయిన రాకపోకలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 01:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)