సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర స్థాయి పోటీలకు ముద్దనూరు విద్యార్థులు ఎంపిక

22 ఆగస్టు, 2026

Muddanur students selected for state-level competitions.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 03:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ముద్దనూరు జిల్లా పరిష్యత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జిల్లా స్థాయి ఆటల పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయులు ఓబులేసు,వ్యాయామ ఉపాద్యాయులు హారిఫ్ మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్స్ ఆటల పోటీల్లో భాగంగా కడపలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీల్లో బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ముద్దనూరుకు చెందిన యశ్వంత్ ఆనంద్,లక్ష్మి నరసింహ,అంజన్ కుమార్,వెంకట తేజ పాల్గొన్నారని తెలిపారు. వాలీబాల్లో యశ్వంత్ ఆనంద్,లక్ష్మీ నరసింహ కబడ్డీలో అంజన్ కుమార్,అథ్లెటిక్స్ - లాంగ్ జంప్ వెంకట తేజ రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు చెప్పారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆకాక్షించారు. ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఓబులేసు,వ్యాయామ ఉపాధ్యాయులు హారిఫ్,సిబ్బంది అభినందించారు.తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్