ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ముద్దనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కడపలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీల్లో కబడ్డీ అండర్ 17 విభాగంలో శైలజ (ముద్దనూరు), మేఘన (చెన్నారెడ్డిపల్లె), దీపిక.. స్టాండ్ బై (ముద్దనూరు), అథ్లెటిక్స్ విభాగంలో అండర్ -14 - లాంగ్ జంపులో సాయి శిరీష (దేనేపల్లె) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి, పిడి కల్పన తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు శైలజ, మేఘన, దీపిక, సాయిశిరీషను హెచ్ ఎమ్ రాజ్యలక్ష్మి, ఇంచార్జ్ హెచ్ ఎమ్ విద్యున్మతి, పిడి కల్పన అభినందించారు. ఉపాద్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి రాణించాలని వారు ఆకాంక్షించారు.








కామెంట్లు (0)