గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పందుల స్వైర విహారం..

1 గంట క్రితం

pigs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 10:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- పట్టించుకోని అధికారులు

ప్రజాశక్తి-కొండాపురం: కొండాపురం పట్టణంలో పందులు స్వైర విహారం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించు కోవడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొండాపురం పట్టణంలోని అన్ని విధులలోనూ పందులు స్వైర విహారం చేస్తున్నాయి .పందుల ఇండ్ల మద్యలో నివసించడం వలన  ప్రమాదకరమైన అనేక వ్యాధులు  ప్రబలే అవకాశం లేకపోలేదు. గ్రామం లోని పంచాయతీ అధికారి కార్యాలయం ,తాసిల్దార్ కార్యాలయం, మండల అభివృద్ధి అధికారి కార్యాలయము, ప్రభుత్వ ఆసుపత్రి, శాంతినగర్, రమేష్ రెడ్డి కాలనీ,రామచంద్ర నగర్, రామ సుబ్బారెడ్డి కాలనీ మెయిన్ బజార్, ఇక్కడ అక్కడ అనకుండా అన్ని విధులలోను విచ్చలవిడిగా పందులు  స్వైర విహారం చేస్తున్నాయి. పందుల స్వైర విహారాన్ని అధికారులు కల్లారా చూస్తున్నప్పటికీ వాటి నివారణ పై చర్యలు తీసుకోవడంలేదు.  ఈవిషయం పై అనేకమార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని ప్రజలు అంటున్నారు. వీధులలోని కోళ్ళను పట్టి పీక్కు తింటున్నాయని,చిన్న పిల్లలపైన , మేక పిల్లలపైన దాడిచేసే అవకాశాలు ఉన్నాయని  అనేక రకాల వ్వాదులు వచ్చే అవకాశం ఉన్నదని. పందులను   గ్రామం లో నుండి తొలగించుటకు పోలీసులు,గ్రామ పంచాయితీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్