శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బోయినపల్లి హైస్కూల్ కు స్వచ్ఛ ఆంధ్ర 2026 అవార్డు

03 అక్టోబర్, 2026

'Swachh Andhra 2026' Award for Boyinapalli High School
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజంపేట (కడప) : మండల పరిధిలోని కొత్త బోయినపల్లి పీఎం శ్రీ ఎస్ జె ఎస్ ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర 2026 అవార్డు సాధించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కడప కలెక్టరేట్ లోని సభా భవనం లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, స్వచ్ఛ ఆంధ్ర మేనేజింగ్ డైరెక్టర్ బి.సునీల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.భారతి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి స్వచ్ఛ ఆంధ్ర 2026 లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమం ప్రసారము చేశారు. తమ పాఠశాల ఈ అవార్డు సాధించడం పట్ల పారిశుధ్య కార్మికులను, బాల-బాలికలను, ఉపాధ్యాయ బృందసహకారం, ఎంపిక చేసిన జిల్లా ఉన్నతాధికారులకు ప్రధానో పాధ్యాయురాలు కె.భారతి కృతజ్ఞతలు తెలియజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్