శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయంకాలపు కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలి : కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి

5 నిమిషాల క్రితం

The proposal to establish evening courts must be withdrawn immediately GV Raghava Reddy President of the Kadapa Bar Association
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 02:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సాయంకాల కోర్టుల నిర్వహణ న్యాయవ్యవస్థ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా ఉంది...

- ఈ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోకపోతే నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం....

- కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి


ప్రజాశక్తి - కడప : కేంద్ర ప్రభుత్వం, కేంద్ర న్యాయశాఖ మంత్రి సాయంకాలపు కోర్టుల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను తక్షణం ఉపసంహరించుకోవాలని కడప బార్ అసోసియేషన్( న్యాయవాదుల సంఘం) అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. సాయంకాలపు కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కడప బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ తమ విధులు బహిష్కరించి జిల్లా కోర్టు రెండవ ప్రధాన గేటు ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర న్యాయశాఖ మంత్రి సాయంకాలపు కోర్టుల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను చేయడం జరిగిందన్నారు. దీనిని పైలెట్ ప్రాజెక్టుగా ఢిల్లీ, బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలను పంపించడం జరిగిందన్నారు. ముఖ్యంగా బార్ అసోసియేషన్లు, బార్ కౌన్సిల్ లను, పబ్లిక్ ను సంప్రదించకుండా అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఇదివరకు ఫెయిల్ అయిన కాన్సెప్ట్ ను ఇప్పుడు ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి అన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు సాయంకాలపు కోర్టుల ద్వారా విశ్రాంత జడ్జీలు, సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు పని వేళలు నిర్ణయించినట్లు ఈ ప్రతిపాదనలలో ఉన్నాయన్నారు. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా ఉందన్నారు. దీని ద్వారా న్యాయవాదులకు, ప్రజలకు ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయవ్యవస్థకు సమాంతరంగా ద్వితీయ శ్రేణి న్యాయవ్యవస్థను నడపాలని కేంద్ర ప్రభుత్వం యొక్క దురాలోచనగా ఉందన్నారు. ఈ విధంగా చేస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం, నమ్మకం లేకుండా పోతుందన్నారు. దీనికి బదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశ జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తులను నియమించి దానికి సంబంధించిన కోర్టు భవనాలను, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవల ప్ చేయడం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కారం అవుతాయన్నారు. అంతేగాని ఇటువంటి ద్వితీయ శ్రేణి న్యాయవ్యవస్థ ఏర్పాటు ద్వారా కాదన్నారు. ఇది న్యాయవాదులపై తీవ్ర పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. న్యాయవాదులకు కూడా తమ కుటుంబాల బాగోగులు, కుటుంబంతో గడిపే సమయం లేకుండా పోతుందన్నారు. సాయంకాలం 5:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు న్యాయవాదులు తమ సొంత కార్యాలయాల్లో పనులు నిర్వహించుకునే సమయం అన్నారు. సాయంత్రం ఐదు గంటల నుండి మరుసటి రోజు కేసుల యొక్క విచారణ, క్లైంట్ సూచనలను, కేసుల ప్రిపరేషన్, ఫైలింగ్ చేసుకునే వీలుంటుంది అన్నారు. సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కోర్టులు ఏర్పాటు చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటుందన్నారు. మహిళా న్యాయవాదులు, క్లైంట్లు, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే క్లైంట్ల కు తీవ్ర ఇబ్బందులు ఉంటాయన్నారు. ముఖ్యంగా మహిళలకు భద్రత కరువవుతుందన్నారు. కావున సాయంకాలపు కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనలను తక్షణం ఉపాసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు మరింత ఉదృతం చేయాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో కడప బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వి. రాజగోపాల్ రెడ్డి, కార్యదర్శి హరి గణేష్, కోశాధికారి ఏ. ఉమాదేవి, స్పోర్ట్స్ సెక్రటరీ రాజా, బార్ అసోసియేషన్ సభ్యులు, మాజీ అధ్యక్షులు సంపత్ కుమార్, భువన ఏకాదశ రెడ్డి, సుబ్రహ్మణ్యం, బాలసుబ్బయ్య, అక్బర్ అలీ ఖాన్, పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్