-వైస్ చైర్మన్ గా డాక్టర్ సాధికా షేక్
ప్రజాశక్తి -కర్నూలు క్రైమ్ : కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా చైర్‌పర్సన్ పదవికి కౌతాళం జడ్పీటీసీ సభ్యుడు చూడి ఉలిగయ్య, వైస్ చైర్మన్‌గా దేవనకొండ మండలం జడ్పిటిసి సభ్యురాలు డాక్ట ర్ సాధికా షేక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ లతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశ కార్యక్రమంలో పాల్గొని, నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి డాక్టర్ సిరి పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు , పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు , ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బి.వి జయ నాగేశ్వర రెడ్డి , ఆదోని ఎమ్మెల్యే డాక్ట ర్ పార్థసారథి , కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)