శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హోటల్ భవన యజమాని నిర్లక్ష్యం - భవన నిర్మాణ కార్మికుడు బలి

11 నిమిషాల క్రితం

భవన నిర్మాణ కార్మికుడు బలి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 02:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మెస్ ఏర్పాటు చేయకుండా బహుళ అంతస్తులు నిర్మాణం చేపట్టకూడదు.. యజమాని పై చర్య తీసుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్


చిత్తూరు : చిత్తూరు గాంధీ రోడ్డులో విష్ణు భవన్ హోటల్ యజమాని నూతన భవన నిర్మాణం చేపడుతున్న క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన గురువారం రఘు అనే భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదం జరిగి చనిపోవడం దారుణమని హోటల్ యజమాని పై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా శుక్రవారం గంగరాజు విలేకరులతో మాట్లాడుతూ ... బహుళ అంతస్తులు నిర్మించేటప్పుడు చుట్టూ మెస్ ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఏమాత్రం ఏర్పాటు చేయకపోవడం దారుణం అన్నారు. ఒక పక్క మున్సిపల్ అధికారులు మరోపక్క లేబర్ అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి బహుళ అంతస్తులు నిర్మించేటప్పుడు రక్షణ వలయం ఏర్పాటు చేయకపోవడంతో ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. తెలిసి ఘటన జరిగిందని తెలియకుండా అనేక ఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయని భవన నిర్మాణ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్న ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.


''రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు అడ్డా అని కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేసి కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చిత్తూరులో శేషాపిరాన్ వీధి లో లేబర్ అడ్డా కార్యాలయం నిర్మించారు. దీనికి కూత వేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. నిర్మాణం చేపట్టే యజమానుల నుండి కార్మికుల సౌకర్యార్థం సెస్ ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలి అయితే అది కూడా సక్రమంగా అమలు కావడం లేదు. ప్రభుత్వం సంక్షేమ బోర్డు లో ఉన్న డబ్బులను ఇతర వాటికి మళ్లీ ఇచ్చి కార్మికులకు అన్యాయం చేస్తున్నది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు యజమానులు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది వాళ్లు చెల్లించకుండా ఇటు ప్రభుత్వం చెల్లించకుండా కార్మికుల మృతి చెందినప్పుడు వారి కుటుంబాలు ఎలా జీవనం గడపాలి `` అని గంగరాజు ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ పథకాలను అన్నిటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించుకోవడంతో అనేకమంది భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారని వారికి కూడా పనిచేస్తున్న క్రమంలో ఎలాంటి రక్షణ లేకపోవడం వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా బహుల అంతస్తులు నిర్మించేటప్పుడు యజమానులు మెస్సులు ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చనిపోకుండా వారు ప్రాణాలను కాపాడువచ్చని లేబర్ అధికారులు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్