ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : మండల కేంద్రంలోని జిల్లా పరిష్యత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి ఆటల పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం ముద్దనూరు బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి, పిడి కల్పన మాట్లాడుతూ .... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం అమరావతి చాంపియన్ షిప్ మెగా టోర్నమెంట్ నిర్వహించిందన్నారు. అందులో భాగంగా ఈనెల 10న కడపలోని మున్సిపల్ స్టేడియంలో జిల్లా స్థాయి అమరావతి చాంపియన్ షిప్ మెగా టోర్నమెంట్ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. టోర్నమెంట్ లో ముద్దనూరు బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు శైలజ, మేఘన, నవ్యదీప్తి పాల్గొన్నారు. అండర్ - 17 విభాగం కబడ్డీలో శైలజ (ముద్దనూరు), మేఘన (చెన్నారెడ్డిపల్లె) , ఖోఖోలో నవ్య దీప్తి (బొందలకుంట) విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడల్లో విద్యార్థులు పాల్గొననున్నట్లు చెప్పారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపిక కావడంతో ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు విద్యున్మతి, ఉపాద్యాయులు అభినందించారు.తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ముగ్గురు విద్యార్థినిలు ఎంపిక
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 17, 2026, 01:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)