నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు : డిఎస్పి వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యులు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జమ్మలమడుగు డిఎస్పి వెంకటేశ్వరరావు సూచించారు. ముద్దనూరు పోలీస్ స్టేషన్‌ను మంగళవారం డిఎస్పి వెంకటేశ్వరరావు సందర్శించి, పలు రికార్డులు పరిశీలించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిఐ నగేష్ బాబు, సిబ్బందితో డిఎస్పి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఐదు క్లస్టర్ల లోని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 21 నుండి 23 వరకు జరగనున్న నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి క్లస్టర్ పాయింట్ వద్ద అధికారులు, సిబ్బంది తీసుకోవల్సిన నిర్వహించాల్సిన విధులు జాగ్రత్తలపై డిఎస్పి దిశానిర్దేశం చేశారు. ముందస్తు జాగ్రత్తగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.







కామెంట్‌లు (0)