- గత పది రోజుల నుంచి దాడులు చేస్తున్నారు : ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి
ప్రజాశక్తి-పులివెందుల టౌన్ (కడప) : కాలం ఒకే మాదిరిగా ఉండదని తమ ప్రభుత్వం వస్తుందని సినిమా చూపించడం ఖాయమని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని నగరగుట్టకు చెందిన నాగరాజు అనే వైసిపి కార్యకర్త వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. బుధవారం ఉదయం అవినాష్ రెడ్డి నగరగుట్టకు చేరుకొని, నాగరాజు వాహనం దగ్ధమైన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... గత పది రోజుల నుంచి వైసిపి నాయకుల, కార్యకర్తల వాహనాలను టిడిపి గుండాలు దగ్ధం చేయడం జరుగుతుందని, చేసేవారిని చేయించేవారిని వదలబోమని చట్టం ముందు నిలబెట్టి సినిమా చూపిస్తామన్నారు. ఎన్నికల నామినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి పోలీసులను అడ్డం పెట్టుకుని నామినేషన్ వేయకుండా అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే టిడిపికి చెందిన ఒక్కరు కూడా గెలవలేరనే ఉద్దేశంతోనే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్నప్ప వైసీపీ నాయకులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)