శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యథేచ్ఛగా మాంసం విక్రయాలు

02 అక్టోబర్, 2026

Unchecked sale of meat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 12:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : హింసకు వ్యతిరేకంగా .... మహాత్మాగాంధీ అహింసా మార్గం ద్వారా పోరాటం చేసిన సంగతి స్మరించుకుంటూ .... గాంధీ జయంతి రోజున ఎలాంటి హింస జరగకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ, రాష్ట్ర వ్యాప్తంగా మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం విధించాయి. ఆ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. చికెన్ దుకాణదారులు ప్రభుత్వ ఆదేశాలు భేఖాతార్ చేస్తూ శుక్రవారం ముద్దనూరులో యథేచ్ఛగా చికెన్ దుకాణాలు తెరిచి మాంసం విక్రయిస్తున్నారు. అధిక ధరలకు అమ్ముతూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. సంబంధిత అధికారులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు పట్టించుకోకుండా చూసి చూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ మాంసం విక్రయిస్తున్న చికెన్ దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్