ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిస్కస్ త్రో లో రాష్ట్ర స్థాయి పోటీలకు యామవరం విద్యార్థి ఎంపిక

1 గంట క్రితం

Yamavaram student selected for state-level discus throw competition
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : యామవరం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధి ఎమ్.సరస్వతి అథ్లెటిక్స్ విభాగంలో జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.అరుణాదేవి, పిడి వనం రవి మాట్లాడుతూ .... గ్రామానికి చెందిన సరస్వతి పాఠశాలలో 8వ తరగతి చదువుతుందన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కడపలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో సరస్వతి అండర్ -14 అట్లెటిక్స్ విభాగంలో డిస్కస్ త్రోలో పాల్గొని ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్ధిని హెచ్ ఎమ్ అరుణాదేవి, ఇంచార్జ్ హెచ్ ఎమ్ వెంకట సురేష్ బాబు, పిడి వనం రవి, ఉపాద్యాయులు అభినందించారు. తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్