ఇంజినీరింగ్‌లో 70.52 శాతం, అగ్రి, ఫార్మాలో 89.04 శాతం ఉత్తీర్ణత
ఎక్స్ ద్వారా ప్రకటించిన మంత్రి లోకేష్
రేపు అని చెప్పి బుధవారమే విడుదల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. జులై 2న విడుదల చేస్తామని ప్రకటించిన ఉన్నత విద్యామండలి బుధవారమే చడీచప్పుడు లేకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో ఎక్స్ ద్వారా విడుదల చేయించింది. పరీక్ష నిర్వహించిన 43 రోజుల తరువాత ఈ ఫలితాలను విడుదల చేసింది. ఇంజినీరింగ్‌లో బాలికలు, అగ్రి, ఫార్మా విభాగాల్లో బాలురు హవా సాధించారు. అయితే ఇంజినీరింగ్‌లో టాప్-10 ర్యాంకులు సాధించిన వారిలో బాలురే అధికంగా ఉండటం విశేషం. మే 12 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్షకు 2,76,572 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,82,317 (70.52 శాతం) మంది అర్హత సాధించారు. బాలికలు1,21,769 మంది దరఖాస్తు చేసుకోగా 1,13,717 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 81,473 (71.65 శాతం) అర్హులయ్యారు. బాలురు 1,54,803 మంది దరఖాస్తు చేసుకోగా, 1,44,828 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,00,844 (69.63 శాతం) అర్హత సాధించారు. బాలురు కంటే బాలికలు ఇంజినీరింగ్‌లో 2.02 శాతం అధిక ఉత్తీర్ణత సాధించారు. మే 18, 19 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మా పరీక్షకు మొత్తం 79,231 మంది దరఖాస్తు చేసుకోగా, 70,929 మంది పరీక్షకు హాజరయ్యారు. 63,546 (89.59 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 18,589 మంది దరఖాస్తు చేసుకోగా, 16,301 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో 14,707 (90.22 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 60,642 మంది దరఖాస్తు చేసుకోగా, 54,628 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో 48,839 (89.40 శాతం) అర్హత సాధించారు. బాలికలు కంటే బాలురు 0.82 శాతం అధికంగా అర్హత సాధించారు.
ఇంజినీరింగ్ టాప్ ర్యాంకర్లలో బాలురదే హవా
ఇంజినీరింగ్ టాప్-10 సాధించిన వారిలో బాలురే ఎక్కువగా ఉన్నారు. ఇందులో బాలికలకు సంబంధించి 2వ ర్యాంకు సాధించిన కోరుకొండ శ్రావ్య మాత్రమే ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో టాప్-10లో ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారు. తెలంగాణకు చెందిన తెల్లూరి శ్రేయాస్ రెడ్డి ఇంజినీరింగ్‌లో ఐదో ర్యాంకు, కుడుముల వెంకట ఆక్షజ్ రెడ్డి అగ్రికల్చర్, ఫార్మాలో రెండో ర్యాంకు సాధించారు.
https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
ఈ కింది లింక్ పై క్లిక్ చేసి AP EAPCET result 2026 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx
టాప్ 10 ర్యాంకర్లు వీరే ..
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో టాపర్లు..
జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి - గుంటూరు జిల్లా
కోరుకొండ శ్రావ్య - శ్రీకాకుళం
వెన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి - పల్నాడు
తుంగ దుర్గా సుప్రభాత్ - పల్నాడు
తెల్లూరి శ్రేయస్ రెడ్డి - హైదరాబాద్
ముక్కార సాకేత్ - వైఎస్‌ఆర్ కడప
బండి వెంకట సాత్విక్ - గుంటూరు
నూర్ బాషా హఫీజ్ - గుంటూరు
పసల మోహిత్ - కడప
మరక వంశీధర్ రెడ్డి - వైఎస్‌ఆర్ కడప
అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్‌లో టాపర్లు ....
శంబంగి జశ్వంత్ నాయుడు - విజయనగరం
కుడుముల వెంకట మహంత్ అక్షజ్ రెడ్డి - మేడ్చల్ మల్కాజ్‌గిరి
కొండ్రెడ్డి హారికాదేవి శ్రీ అనూహ్య - కృష్ణా
కర్రి సత్యనారాయణ - కాకినాడ
బంటు ధాత్రిక - అనకాపల్లి
పల్లికొండ దర్శ్‌తేజ - కాకినాడ
వల్లెపు ధీరజ్ కృష్ణ - గుంటూరు
దండమూడి జాగృతి - గుంటూరు
ఆళ్ల శ్రీలక్ష్మి సత్యసాయి నిఖితారెడ్డి - పల్నాడు
రేలంగి జయ షణ్ముఖి - విజయనగరం








కామెంట్‌లు (0)