mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్ రీ-ఎగ్జామ్ – టెలిగ్రాం యాప్ బ్లాక్ ..!

2 రోజుల క్రితం

NEET Re-exam – Telegram App Blocked...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కేంద్ర స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. నీట్ రీ-ఎగ్జామ్ వేళ టెలిగ్రాం యాప్‌ను ఇండియా బ్లాక్‌ చేసింది. జూన్ 22వ తేదీ వ‌ర‌కు టెలిగ్రాం యాప్ అందుబాటులో ఉండ‌దు. జూన్ 21వ తేదీన దేశ‌వ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్‌ను నిర్వ‌హిస్తున్న సంగతి విదితమే. ఇక జూన్ 30వ తేదీ వ‌ర‌కు టెలిగ్రాం యాప్‌లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచ‌ర్‌ను కూడా ప్ర‌భుత్వం డిజైబుల్ చేసింది. ఎగ్జామ్ మెటీరియ‌ల్‌ను లీకేజీ చేయ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌ల‌కు చేప‌ట్టింది. మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన యాప్‌ను త‌క్ష‌ణ‌మే బ్లాక్ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల ఆధారంగా అధికారులు ఈ చ‌ర్య చేప‌ట్టారు. కేవ‌లం ఎగ్జామినేష‌న్ పీరియ‌డ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ యాప్‌ను ర‌ద్దు చేశారు. పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌ల‌ను త‌గ్గిచేందుకు ఎడిటింగ్ ఫీచ‌ర్ల‌ను డిజైబుల్ చేశారు. గ‌తంలో పోస్టు చేసిన మెసేజ్‌ల‌ను ఎడిట్ చేసి ఆప్ష‌న్ ప్ర‌స్తుతం 30వ తేదీ వ‌ర‌కు బ్లాక్ చేశారు. పేప‌ర్ లీకేజీల‌కు పాల్ప‌డుతున్న చీటింగ్ ముఠాలు టెలిగ్రాం యాప్‌ను విరివిగా వాడుతున్న‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. నీట్ ప‌రీక్ష రాస్తున్న అభ్య‌ర్థుల‌ను ఆ చీటింగ్ ముఠా టార్గెట్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. పేప‌ర్ లీకేల‌కు చెందిన అనేక ఛాన‌ళ్ల‌ను, గ్రూపుల‌ను ఇప్ప‌టికే ప్ర‌భుత్వం తొల‌గించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్