ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియాన వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యూరీ మెంబర్ మంచు లక్ష్మి మాట్లాడుతూ - కోర్ టీమ్ అంతా మహిళలే ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది. ఆహా వాళ్లు ఈ కార్యక్రమాన్ని ఏదో ఒకటి చేద్దామని చేయడం లేదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో చేస్తున్నారు. ఈ షో ఔట్ పుట్ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. కార్యక్రమం చూశాక మీరు కూడా అమేజింగ్ అనుకుంటారు. కంటెండర్స్ ఎవరూ తక్కువ కాదు. ఈ కార్యక్రమంలో విన్నర్ ఎవరైనా పాల్గొనే ప్రతి ఒక్కరూ నా దృష్టిలో టాప్ లో ఉండేవారే. మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ, మంచి గుర్తింపు ఇచ్చే వేదిక ఈ షో అవుతుందని ఆశిస్తున్నా. ఈ షో కోసం ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నా. ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్న ఆహాకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నారు. జ్యూరీ మెంబర్ రష్మి మాట్లాడుతూ - ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అందరితో పరిచయం ఉన్నవారే. చాలా పాపులర్ అయినవారే. పాండమిక్ తర్వాత సోషల్ మీడియాలో చాలా మార్పులు వచ్చాయి. ఇన్ఫుయెన్సర్స్ ఇంపాక్ట్ చాలా పెరిగిపోయింది. ఏది బ్రాండింగ్ చేస్తున్నా వాళ్ల మీద ఒక బాధ్యత కూడా ఉంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఒక యూనిక్ షో ప్లాన్ చేసింది ఆహా. ఈ కార్యక్రమం గురించి రెండు రోజుల ముందటే చెప్పారు. ఇంత గ్రాండ్ ఈవెంట్ ఉంటుందని అనుకోలేదు. మంచు లక్ష్మి, వైవా హర్ష గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మరింతగా ఆడియెన్స్ కు రీచ్ చేసేందుకు ప్రయత్నిస్తా. అన్నారు.
ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టెన్ రైజర్ ఈవెంట్
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 09:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)